ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్..! 1 d ago
AP: ఆస్పత్రులకు ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.3 వేల కోట్లు బిల్లులు నిలిచిపోయాయి. బకాయిలు చెల్లించాలని ఇప్పటికే నాలుగుసార్లు సర్కారుకు ఆస్పత్రులు నోటీసులు ఇచ్చాయి. అయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో సోమవారం నుంచి ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్య సేవ), ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (ఈహె చ్ఎస్) సేవలను ప్రైవేట్ నెట్‌వర్క్ ఆస్పత్రులు నిలిపేశాయి. ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద ఓపీ, ఐపీ ఇలా పూర్తి స్థాయిలో సేవలు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు.